చిన్నారి పెళ్లి కూతురికి పెళ్లంట.. వరుడెవరో తెలుసా.?
- June 28, 2022
‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన అవికా గోర్, హీరోయిన్‌గా ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో పెద్ద తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అదే హీరోతో అదేనండీ.. రాజ్‌తరుణ్‌తోనే రెండు మూడు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అదే కారణం కావచ్చు.. రాజ్ తరుణ్‌తో అవికా గోర్‌కి అఫైర్లు కూడా అంటగట్టేసింది ఈ పాడు సమాజం. అయితే, ఆ అఫైర్‌ని ఈ జంట తిప్పి కొట్టిందనుకోండి. రాజ్ తరుణ్ తనకు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అవికా చాలా సార్లు చెప్పింది.
అయితే, అవికా గోర్ బాలీవుడ్‌లోనూ సుపరిచితురాలే. అక్కడి బుల్లితెర సీరియల్స్‌తో పాటు చిన్నా, చితకా సినిమాల్లోనూ నటించింది. కాగా, బాలీవుడ్ నటుడు మిళింద్‌తో అవికా గోర్ ప్రేమలో వుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
మిళింద్‌తో పీకల్లోతు ప్రేమతో పాటు, అవికా గోర్, ఆల్రెడీ డేటింగ్‌లోనూ వున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిళింద్‌తో ప్రేమ విషయాన్ని అయితే, కన్‌ఫామ్ చేసేసింది అవికా గోర్. కానీ, పెళ్లి విషయం బయట పెట్టలేదు.
మిళింద్ తనకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. తన కెరీర్ వృద్ధి చెందడానికి మిళింద్ సహాయ సహకారాలు తనకు ఎప్పుడూ తోడున్నాయంటూ, తన లవర్ గురించి చెప్పుకొచ్చింది అవికా గోర్. సో జరుగుతోన్న ప్రచారాన్ని నిజం చేస్తూ, అవికా గోర్ మిళింద్‌ని వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికయితే జర వెయిట్ చేయాలంతే.!
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!