ఎమిరేట్స్ టిక్కెట్ కొనుగోలుపై బుర్జ్ ఖలీఫాకు ఉచిత టిక్కెట్
- June 29, 2022దుబాయ్: ఎమిరేట్స్ టిక్కెట్ కొనుగోలుపై బుర్జ్ ఖలీఫాకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రకటించింది. దుబాయ్ ఫ్లాగ్షిప్ క్యారియర్‌తో తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణీకులు ఎట్ ది టాప్, బుర్జ్ ఖలీఫా, ది దుబాయ్ ఫౌంటెన్ బోర్డ్‌వాక్, లౌవ్రే అబుధాబిలో ప్రవేశించడానికి ఉచిత టిక్కెట్లను పొందొచ్చని ఎమిరెట్స్ ఆఫర్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారని అంతగా అవి ప్రాచుర్యం పొందాలయని పేర్కొంది. జూన్ -జూలై మధ్య యూఏఈ నుండి 2,400 వీక్లీ నెట్వర్క్-వైడ్ డిపార్చర్ సర్వీసులు నమోదయినట్లు ఎమిరెట్స్ వెల్లడించింది. ఉచిత టిక్కెట్లను కోరుకునే ప్రయాణీకులు emiratesoffer@ emirates.com కి ఇమెయిల్ పంపాలని కోరింది. అలాగే ఉచిత ఎంట్రీ టికెట్ కోసం కోడ్లను స్వీకరించడానికి బుకింగ్ రిఫరెన్స్ నంబర్, ప్రయాణం తేదీ, ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుందని ఎమిరెట్స్ తెలిపింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..