భారత్ కరోనా అప్డేట్
- June 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నమోదైన కేసుల సంఖ్యను బట్టి యాక్టివ్ కేసుల లక్షకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14వేల 506 కొత్త కేసులు నమోదు కారణంగా 30 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99వేల 602కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 3.35 శాతానికి చేరగా.. దేశ జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 33వేల 345కేసులు కాగా 5లక్షల 25వేల 77మరణాలు నమోదైనట్లు సమాచారం.
కరోనా రికవరీ రేటు దేశంలో 98.56 శాతంగా ఉండగా.. మంగళవారం ఒక్కరోజే 11వేల 574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారు 4కోట్ల 28లక్షల 8వేల 666 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 530 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.46 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం ఒక్కరోజులో 13లక్షల 44వేల 788 డోసుల టీకాలు అందజేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 46లక్షల 57వేల 138 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..