ఈద్ అల్-అధా సెలవులు.. ప్రయాణీకులకు సలహాలు
- June 30, 2022
దోహా: జూన్ 30, 2022 నుండి దోహా నుండి అధిక సంఖ్యలో ప్రయాణీకులు బయలుదేరుతారు. అలాగే జూలై నుండి దోహాకు తిరిగి వచ్చే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈద్ అల్-అధా సెలవుల కోసం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ప్రయాణీకులకు పలు సూచనలు జారీ చేసింది.
-ప్రయాణీకులు కర్బ్ సైడ్‌కు బదులుగా స్వల్పకాలిక కార్ పార్కింగ్‌లో పికప్, డ్రాప్‌లను నిర్వహించాలని సూచించారు.
-కాంప్లిమెంటరీ కార్ పార్క్ సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.
-ఆన్లైన్లో చెక్-ఇన్ చేయాలని, విమానయానానికి 3 గంటల ముందుగా ఎయిర్ పోర్టు చేరుకోవాలన్నారు. ముందస్తు చెక్-ఇన్ సేవలను పొందాలని సూచించారు.
-ఖతార్ ఎయిర్వేస్ కస్టమర్లు సెల్ఫ్-సర్వీస్ చెక్-ఇన్, బ్యాగ్-డ్రాప్ సౌకర్యాలను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇ-గేట్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు.
-ప్రయాణికులు తమ నిర్దిష్ట విమానయాన సంస్థ నుండి బ్యాగేజీ మార్గదర్శకాలను ముందుగానే తెలుసుకోవాలన్నారు.
-బ్యాగేజీ రీప్యాక్ ఏరియా ప్రయాణికులకు డిపార్చర్ హాల్లో లగేజీ వెయింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
-సెక్యూరిటీ స్క్రీనింగ్‌కు ముందు గడియారాలు, బెల్ట్‌లు, వాలెట్లు, ఆభరణాలు వంటి వ్యక్తిగత వస్తువులను ట్రేలలో వదులుగా ఉంచకుండా బ్యాగ్ లోపల సురక్షితంగా పెట్టుకోవాలని సూచించారు.
-మొబైల్ ఫోన్ల కంటే పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగ్‌ల నుండి తీసి ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ట్రేలలో పెట్టాలన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!