అక్టోబర్‌లో మెటావర్స్ లో మొదటి ఆసుపత్రి ప్రారంభం
- June 30, 2022
యూఏఈ: హెల్త్ కేర్ సంస్థ థంబే గ్రూప్ రాబోయే కొద్ది నెలల్లో యూఏఈలో తమ మొదటి ఆసుపత్రిని మెటావర్స్ లో భాగంగా ప్రారంభించనుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లోపు పూర్తి వర్చువల్ హాస్పిటల్ పూర్తి అవుతుందని సంస్థ ప్రకటించింది. మెడికల్ టూరిజంను దృష్టిలో పెట్టుకొని రోగులకు మెరుగైన సేవలందించేందుకు తుంబే హెల్త్‌కేర్ ఫెసిలిటీ సేవలు విస్తరిస్తున్నామని తుంబే గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ అన్నారు. యూఏఈ హెల్త్ కేర్ సంస్థ తన వైద్యులందరికీ మెటావర్స్ లో రోగులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను నియమించిందన్నారు. గ్రూప్ హాస్పిటల్ సిస్టమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానం చేస్తోందని, దీని ద్వారా కెమెరాలు రోగి కారు నంబర్ ప్లేట్‌ను, ఆసుపత్రిలోకి ప్రవేశించినప్పుడు అతని ముఖాన్ని గుర్తిస్తాయని తంబే గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్బర్ మొయిదీన్ చెప్పారు. ఒక రోగి రిసెప్షన్ వద్దకు వచ్చినప్పుడు, అప్పటికే అతనికి సంబంధించిన ఫైల్ డాక్టర్ల చెంతకు చేరుతుందన్నారు. డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ ఆటోమెటిక్ గా ఫార్మసీకి వెళుతుందని వివరించారు.పేషెంట్ సేవలు, మెడిసిన్ తోసహా అంతా డిజిటల్ గా పూర్తవుతుందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల