ఆటా 17వ మహాసభల్లో పాల్గొనబోతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- June 30, 2022
అమెరికా: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనబోతున్నారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై 2న ఆటా మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ప్రవాస తెలుగు వారు పాల్గొనే సభలో ఆమె ప్రసంగించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ప్రైమ్ మీట్‌కు ఆమె అతిథిగా హాజరవుతారు.
అనంతరం బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ సారి మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఇన్నేళ్లు జరిగిన మహాసభలు ఒక ఎత్తైతే.. ఈ ఏడాది జరగబోయేవి తమకు ప్రత్యేకమన్నారు. ఆనందాలు, బాధలు, విజయాలు, అవకాశాలు పంచుకునే వేదికగా ఇది మారబోతోందని తెలిపారు. మహాసభ ఏర్పాట్ల కోసం 80 కమిటీలు శ్రమిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!