ఉప్పు వంటల్లో కే కాదు..
- June 13, 2015
ఉప్పుని వంటకాల్లో వేసుకోవడానికే కాదు... ఇతరత్రానూ ఉపయోగించుకోవచ్చు.దరు మాట్లాడుతుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు కప్పు నీళ్లలో చిటికెడు ఉప్పూ, పావు చెంచా వంటసోడా వేయాలి. అరగంటయ్యాక ఈ నీళ్లతో పుక్కిలించాలి. ఇది నోట్లోని బ్యాక్టీరియానీ, ఫంగస్‌నీ చంపేస్తుంది. దాంతో దుర్వాసన దూరమవుతుంది.కొందరు గోళ్లు పసుపు చాయలోకి మారడంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు చెంచా ఉప్పునీ, వంటసోడానీ సమపాళ్లలో కలిపి అందులో ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లకు పూతలా వేయాలి. ఆరాక కడిగేస్తే ఫలితం ఉంటుంది.అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యాక్నె ఒకటి. దీన్ని ఉప్పుతో తగ్గించుకోవచ్చు. అరచేతిలో కాస్త ఆలివ్‌నూనె వేసుకొని, దానికి చిటికెడు ఉప్పు చేర్చి ముఖానికి మునివేళ్లతో మర్దన చేసుకోవాలి. ఆలివ్ నూనెకు బదులు కొబ్బరినూనె వాడినా ఫలితం ఉంటుంది. ముఖంపై పుండ్లూ, చిన్నచిన్న గాయాలేమైనా ఉన్నప్పుడు ఈ చిట్కా ప్రయత్నించండి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







