బహ్రెయిన్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకుడు

- June 30, 2022 , by Maagulf
బహ్రెయిన్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకుడు

బహ్రెయిన్: విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహ్రెయిన్ విమానాశ్రయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి తేది: 27.06.2022 నాడు 'గల్ఫ్ ఎయిర్' ఫ్లైట్ GF-275 ద్వారా  హైదరాబాద్ నుండి బహ్రెయిన్ కు వెళ్ళాడు.విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. 

సహాయం కోసం యువకుడి తండ్రి మోజీరాం స్థానిక నాయకుడు పట్కూరి తిరుపతి రెడ్డిని  సంప్రదించాడు.విషయం తెలిసిన టిపిసిసి ఎన్నారై సెల్-గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి... యువకున్ని రక్షించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి,ఇండియన్ ఎంబసీ,తెలంగాణ సిఎంఓ,ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com