మస్కట్ లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
- July 01, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంటర్నెట్, మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయంపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) ఒక ప్రకటన విడుదల చేసింది. సబ్-మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లో ఒకదానిలో వైఫల్యం కారణంగా మసందమ్ గవర్నరేట్‌లో ఇంటర్నెట్ సేవల్లో పాక్షిక అంతరాయం చోటు చేసుకుందని పేర్కొంది. అలాగే మొబైల్ నెట్ వర్క్ సేవలపైనా ప్రభావం చూపిందని తెలిపింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణకు టెలికమ్యూనికేషన్ కంపెనీలు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలను పునరుద్దరించాయని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!