పవన్ జనవాణికి విశేష స్పందన..
- July 03, 2022
హైదరాబాద్: జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, బాధితులు భారీగా వచ్చారని జనసేన నేతలు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. ఇప్పటివరకు 400కు పైగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు పవన్.
పవన్ స్వీకరించిన ఫిర్యాదుల సమాచారాన్ని జనసేన సిబ్బంది కంప్యూటర్ లో నమోదు చేసుకుంటున్నారు. వినతులు, ఫిర్యాదులు అందించిన బాధితులకు జనసేన సిబ్బంది రసీదు అందజేసింది. ఫిర్యాదులను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు జనసేన తెలిపింది.

తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







