'గల్ఫ్ జీవితం'
- June 13, 2015
'గల్ఫ్ జీవితం' పై వాసుదేవ రావు గారి మనోభావాలు
గల్ఫ్ అనే పదం వినగానే, మనకు వినిపించే మొదటి పదం దుబాయ్ సేట్. గల్ఫ్ దేశం వెళ్ళిన వారు రెండు సంవత్సరాలకో లేదా సెలువుల్లో మాతృదేశం వెళుతుంటారు. గల్ఫ్ వెళ్ళిన తరువాత డబ్బు సంపాదన, హావభావాలూ, దుబాయ్ కళ్ళజోడు లాంటివి మార్పులను చూసి అందరూ గల్ఫ్ వెళ్లి సంపాదించాలనే ప్రయత్నాలు మొదలు పెడతారు. పల్లెల్లో అయితే పని లేక తిరుగుతున్నవారిని, అందరూ సంపాదిస్తున్నారు నువ్వు నాలుగు డబ్బులు సంపాదించు ఎన్ని రోజులని ఇలా... అంటూ బయట దేశాల్లో పనిచేస్తున్నవారిని ఉదాహరణగా చెప్తుంటారు.
గల్ఫ్ దేశం వెళితే బాగా సంపాదించవచ్చు అన్న భావం కలుగుతుంది. కానీ గల్ఫ్ జీవితం ఎంతమందికి మంచి చేకూర్చుతుందో, ఎంతమంది ఎడారి జీవితం గడుపుతున్నారో తెలియని వారు చాలాఎక్కువే. విధి రాత కొందరికి విషాదాన్ని ఇస్తే, మరికొందరికి మంచి జీవితాన్నే ఇచ్చిందని చెప్పాలి. జీవితం అనేది ఒక నావ లాంటిది ఎన్నో ఆటుపోట్లు అధిగమించి పయనం సాగించే మనకు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే చాలామంది మనసులో బాధలు, మమతానురాగాలు అధిగమించి, మాతృదేశం వచినప్పుడు తమవారికి తాము పడే కష్టాలు, ఎటువంటి బాధలు కనబరచకుండా హుందాతనం ప్రవర్తిస్తూ, అంతా బాగానే ఉందని చెబుతూ, తమ వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంతోషం చూసి, తిరిగి ఎడారి జీవితం కొనసాగిస్తుంటారు. ఏదో తెలియని వెలితి (....మనదేశం.... మన ఊరు...మన వాళ్ళూ...అందరికీ దూరంగా... అనే భావన మదిలో...) అలా అని గల్ఫ్ అంటే బాధల మయం అని కాదు.
దేశం విడిచి పరాయిదేశంలో ఉంటూ "తమవారికీ దూరంగా ఉంటూ, కష్టసుఖాలు పంచుకోలేని స్థితి, మమకారాలు పెంచుకొంటున్న వారి జీవన పరిస్థితులు మరియు వారి మనస్సులను తొంగి చూసే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో గల్ఫ్ దేశాల గురించి, విసాల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, లైఫ్ స్తైల్ గురించి, కష్టాలు, సమస్యలు మరియు జాగ్రత్తలు గురించి వివరిస్తూ వ్రాయడం జరిగింది. గల్ఫ్ దేశాలు వెళ్ళాలనుకున్న వారికీ మరియు అక్కడున్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







