తెలంగాణ కరోనా అప్డేట్
- July 03, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 12వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 457గా(జులై 3) ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22వేల 384 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 457 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 285 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 25, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులు, సంగారెడ్డిలో 35 కేసులు, కరీంనగర్ లో 12 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..







