దుబాయ్ లో టెస్లా మోడల్ 3 ట్రయల్

- July 04, 2022 , by Maagulf
దుబాయ్ లో టెస్లా మోడల్ 3 ట్రయల్

యూఏఈ: దుబాయ్ రోడ్లపై టెస్లా కారు పరుగులు తీయనుంది. టెస్లా మోడల్ 3 ట్రయల్ ప్రాతిపదికన దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ ద్వారా ప్రయోగాత్మకంగా నడుపనున్నారు. ట్రయల్ లో భాగంగా వాహనం సామర్థ్యాన్ని ధృవీకరించనున్నారు. 2017 నుండి 172 టెస్లా వాహనాలను లిమోసిన్‌లుగా నిర్వహించడం "భారీ విజయం" అని రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. 2017లో RTA 80 టెస్లా మోడల్ S, 50 టెస్లా మోడల్ X , 42 టెస్లా మోడల్ 3లతో కూడిన దుబాయ్ టాక్సీ లిమోసిన్ ఫ్లీట్‌లో భాగంగా 172 టెస్లా వాహనాల ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల కార్యాచరణ సామర్థ్యంలో సానుకూల సూచికలను నమోదు చేస్తారు. ముఖ్యంగా సున్నా కర్బన ఉద్గారాలు, అధిక కస్టమర్ సంతృప్తి రేటింగ్ పరంగా వీటిని నిర్ణయిస్తారని RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మత్తర్ అల్ టేయర్ అన్నారు. 2026 నాటికి దుబాయ్‌లో 90 శాతం లైమో ఫ్లీట్‌ను పర్యావరణ అనుకూల వాహనాలుగా (హైబ్రిడ్/ఎలక్ట్రిక్) మార్చే చొరవకు ఇది మద్దతు ఇస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com