భారత్ కరోనా అప్డేట్

- July 04, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ:  భార‌త్‌లో కొత్త‌గా 16,135 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం ఉద‌యం తెలిపింది. గ‌త 24 గంటల్లో 13,958 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో 24 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో హోం క్వారంటైన్లు/ ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య‌ 1,13,864కు పెరిగింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా ఉంది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 4,28,79,477 మంది కోలుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 5,25,223 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 197,98,21,197 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వాడారు. నిన్న 1,78,383 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com