ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
- July 05, 2022
ఏపీ: ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల (ఆగస్టు)లో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను గౌతమ్ సవాంగ్ విజయవాడలో మంగళవారం వెల్లడించారు. 2018 సంవత్సరంలో 167 గ్రూప్-1 పోస్టుల (30పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు) భర్తీకి ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టింది. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్-1లో నిలిచారు. వైఎస్సార్ జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన కె. శ్రీనివాసరాజు టాప్-2లో నిలవగా, హైదరాబాద్ కు చెందిన సంజన సింహ టాప్ -3లో నిలిచారు. మొదటి పది స్థానాల్లో ఏడుగురు మహిళలు ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను ఏపీపీఎస్సీ కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. 2018 గ్రూప్-1 పరీక్షలకు మొత్తం లక్షా నలభై వేల మంది హాజరయ్యారని, స్క్రీనింగ్ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారని సవాంగ్ తెలిపారు. 167 గ్రూప్-1 పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారని అన్నారు. అయితే వచ్చే నెలలో 110 గ్రూప్-1 పోస్టులకు, 182 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు. ఈ నెల 24న దేవాదాయశాఖలో ఈవో పోస్టులకు, రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందని, రాబోయే కాలంలో మరో 13నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







