సౌదీ లో తెలంగాణ కార్మికుల కష్టాలు
- June 13, 2015
సౌదీ అరేబియాలో కొనసాగుతున్న సంక్షోభం తెలంగాణ కార్మికుల ఉపాధికి విఘాతం కలిగిస్తోంది. అక్కడ కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభాన్ని అణచివేయడానికి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా కార్మికులను వారం రోజుల వ్యవధిలో జైలులో పెట్టినట్లు తెలిసింది. మొదట కంపెనీ వీసాలపై సౌదీకి వెళ్లినా, అక్కడి పరిస్థితులు బాగాలేక పోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేస్తూ ఎంతో కొంత ఎక్కువ సొమ్మును సంపాదించుకునే వారిలో తెలంగాణ జిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు.
ఒప్పందం ప్రకారం కంపెనీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడం, పని భారం ఎక్కువగా ఉండటంతో అప్పులు తీర్చే మార్గం కోసం అనేక మంది కార్మికులు వీసా, వర్క్‌పర్మిట్, పాస్ పోర్టులను వదిలివేసి నిబంధనలకు విరుద్ధంగా సౌదీలో పని చేస్తున్నారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో సౌదీ పోలీసులు తనిఖీలు చేస్తుండటం తో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్మికులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది కార్మికులు సౌదీ జైళ్లలో మగ్గుతున్నారు. మళ్లీ కొత్తగా అరెస్టులు మొదలు కావడంతో కార్మికుల్లో ఆందోళన నెల కొంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సౌదీ జైళ్లో మగ్గుతున్న కార్మికులను సొంత గ్రామాలకు రప్పించి ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







