తెలుగమ్మాయ్ పెదాలకు సర్జరీ జరిగిందా.?

- July 06, 2022 , by Maagulf
తెలుగమ్మాయ్ పెదాలకు సర్జరీ జరిగిందా.?

అందాల భామ అనన్య నాగళ్ల గురించి అందరికీ తెలిసిందే. ‘ప్లే బ్యాక్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘వకీల్ సాబ్’ సినిమాతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సమంతతో కలిసి ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది అనన్య నాగళ్ల.
ఇక, సోషల్ మీడియాలో అనన్యా నాగళ్ల ఓ సెన్సేషన్. అవర్ గ్లాస్ ఫిజిక్‌తో కుర్రోళ్లకు ఘాటైన వలలు విసరడంలో ఆరి తేరిపోయింది ఈ తెలుగమ్మాయ్. తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరం అనే మాటను దూరం చేసేసింది తన హాట్ అలర్ట్‌తో.

అయితే, తాజాగా అనన్య నాగళ్లకు హీరోయిన్‌గా ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందట. ఓ సినిమా ఫంక్షన్‌లో ఈ విషయం అనన్య స్వయంగా చెప్పింది. కథ, కథనాలు చాలా బాగుంటాయ్. నాకు కథ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.. అంటూ ఫ్యాన్స్‌నుద్దేశించి అనన్య మాట్లాడింది.

అయితే, ఆ సినిమా టైటిల్ ఏంటీ.. ఆ కథేంటీ.? అనే విషయం చెప్పలేదు అనన్య. ఆ సంగతి అటుంచితే, అన్ని మాటలు చెప్పినా, ఆడియన్స్ దృష్టికి అవేం పెద్దగా ఎక్కలేదు. కానీ, అనన్య పెదాలపై ఆడియన్స్ దృష్టి ఎక్కువగా మళ్లింది ఈ సారి.

ఎందుకంటే, అనన్య పెదాలు ఇంతకు ముందు కన్నా కాస్త భిన్నంగా కనిపించడమే అందుకు కారణం. దాంతో, అనన్య పెదాలకు సర్జరీ చేయించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగానే అనన్య పెదాలకు సర్జరీ జరిగిందా.? జరిగితే జరిగి వుంటుంది. సెలబ్రిటీలకు ఇలాంటి సర్జరీలు చాలా చాలా కామన్ కదా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com