జమీల్ అలెగ్జాండర్ థెర్మియోటిస్‌తో జోర్డాన్ యువరాణి ఇమాన్ నిశ్చితార్థం
- July 07, 2022
జోర్డాన్ : జోర్డాన్ యువరాణి ఇమాన్ బింట్ అబ్దుల్లా II, జమీల్ అలెగ్జాండర్ థెర్మియోటిస్‌ల నిశ్చితార్థం జరిగినట్లు రాయల్ హాషెమైట్ కోర్ట్ ప్రకటించింది. ఈ వేడుక జూలై 5న రాజు అబ్దుల్లా II, క్వీన్ రానియా సమక్షంలో థెర్మియోటిస్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాయల్ హాషెమైట్ కోర్ట్ హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ ఇమాన్ బింట్ అబ్దుల్లా II, జమీల్ అలెగ్జాండర్ థెర్మియోటిస్‌తో జూలై 5న వారి కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా మెజెస్టీస్ కింగ్ అబ్దుల్లా II, క్వీన్ రానియా అల్ అబ్దుల్లా, అలాగే వారి రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II, ప్రిన్స్ హషేమ్ బిన్ అబ్దుల్లా II, ప్రిన్సెస్ సల్మా బింట్ అబ్దుల్లా II, మిస్టర్ థర్మియోటిస్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారని రాయల్ హాషెమైట్ కోర్ట్ వెల్లడించింది. అనంతరం క్వీన్ రానియా తన కుమార్తెను కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది. నా ప్రియమైన ఇమాన్‌కి అభినందనలు.. జమీల్ తో మీ జీవితం ప్రేమ, నవ్వులతో నిండి ఉండాలని కోరుకుంటున్నట్లు క్వీన్ రానియా ఆకాంక్షించారు. 1996లో అమ్మాన్‌లో రాజు అబ్దుల్లా II, జోర్డాన్ రాణి రానియాలకు రెండో సంతానంగా యువరాణి ఇమాన్ జన్మించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







