యజమానిని చంపిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు

- July 07, 2022 , by Maagulf
యజమానిని చంపిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు

యూఏఈ: తన యజమానిని హత్య చేసిన కేసులో 30 ఏళ్ల ఆసియా వ్యక్తికి అజ్మాన్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఘటనా స్థలంలో ఉన్న నిఘా కెమెరాల్లో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు రికార్డయ్యాయి. కోర్టు ఫైల్స్ ప్రకారం..  అజ్మాన్ సెంటర్‌లోని ఫలహారశాల సమీపంలో కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే బాధితుడు మృతి చెందాడు. బాధితుడిని నిందితుడు వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయినట్లు సీసీ ఫుటేజీ ద్వారా ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని ప్రశ్నించగా.. తమ దేశానికే చెందిన కంపెనీ యజమానిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితుడు తనను ఉద్యోగం చేసేందుకు టూరిస్ట్ వీసాపై యూఏఈకి తీసుకొచ్చాడని, అలాగే తమ దేశం నుంచి మరింత మంది కార్మికులను తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలో తొమ్మిది మందికి వీసాలు ఇప్పించేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని నిందితుడు పేర్కొన్నారు. కానీ తొమ్మిది మందికి రెసిడెన్సీ ప్రక్రియలను పూర్తి చేసేందుకు మృతుడు నిరాకరించాడని, పైగా  నాలుగు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదని నిందితుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తెలియజేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com