మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన ఇండియన్ టెకీ
- July 07, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్‌పాట్ కొట్టాడు. దుబాయ్‌లో తాజాగా నిర్వహించిన మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారత ప్రవాసుడు అనీష్ 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా మహజూజ్‌లో పాల్గొంటున్న అనీష్‌కు తాజాగా అదృష్టం వరించింది.శనివారం(జూలై 2న) దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తాజాగా దుబాయ్‌లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్‌ను ర్యాఫిల్ నిర్వాహకులు అనీష్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ..ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు.ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు..ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.కానీ, తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన అప్పులు తీరడంతో పాటు తన పిల్లల భవిష్యత్ కూడా బాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







