సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- July 07, 2022
హైదరబాద్: శంషాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు.
ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి లభిస్తుందన్నారు. శాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. ఆవిష్కరణల కోసం టీ హబ్ వంటి ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..