తమిళ్ హీరో విక్రమ్‌కు గుండెపోటు..
- July 08, 2022చెన్నై: ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది. ఈరోజు ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్-1 సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం చెన్నైలో రిలీజ్ కానుంది. ఆ కార్యకమానికి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. విక్రమ్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్-1 పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. సెప్టెంబర్ 3న దక్షిణాదిభాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్