కొవిడ్ నిబంధనల మధ్య ఈద్‌ను సెలబ్రేషన్స్
- July 11, 2022
ఖతార్: ఖతార్ లో నిన్న ఈద్ అల్ అదాను కోవిడ్-19 నిబంధనల మధ్య ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా 588 మస్జీదులు, ప్రార్థన మైదానాల్లో ప్రార్థనలు జరిపారు. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పౌరులు, నివాసితులతో పాటు మొత్తం అరబ్ ప్రపంచానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈద్ సెలవుదినాన్ని ఆస్వాదించడానికి ప్రజలు ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా, వినోద ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, ఆతిథ్య సేవా కేంద్రాలు ప్రజల రాకతో కళకళలాడాయి. ఇటీవల కోవిడ్-19 కేసులు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ నిబంధనలను ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరిగి ప్రవేశపెట్టింది. ఈద్‌ను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, అర్హులందరూ బూస్టర్ షాట్లతో సహా టీకాలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్-19 ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







