కువైట్ లో తప్పిపోయిన చిన్నారి కథ విషాదాంతం

- July 11, 2022 , by Maagulf
కువైట్ లో తప్పిపోయిన చిన్నారి కథ విషాదాంతం

కువైట్: కువైట్‌లో కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి కథ విషాదాంతమైంది. చిన్నారి మృతదేహాన్ని అహ్మదీ పోలీసులు గుర్తించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కుటుంబ సభ్యులే చిన్నారిని హత్య చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. నిందితుడు చిన్నారిని హత్య చేసి పాతిపెట్టినట్లు, ఆ స్థలాన్ని పోలీసులు గుర్తించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, కేసు ఇంకా విచారణలో ఉన్నదని, నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com