ఏపికి ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన గవర్నర్​

- July 15, 2022 , by Maagulf
ఏపికి ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన గవర్నర్​

అమరావతి: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్​కు చేరుకోనున్నారు. జాతీయకవి దామరాజు ‘పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల వజ్రోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఉప రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com