మధ్య ప్రదేశ్: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి..15 మందికి గాయాలు
- July 18, 2022
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.
పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు