ఎన్టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
- July 18, 2022
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ: కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయటనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవల్‌పమెంట్, హైడ్రోజన్ కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ పీవీ లేఅవుట్, విండ్, సబ్ స్టేషన్ డిజైన్, సిస్టమ్ ఇంజనీరింగ్, స్విచ్‌యార్డ్, స్ట్రక్చర్స్, ఫౌండేషన్, సివిల్ పీవీ లైఔట్, హ్యూమన్ రిసోర్సెస్, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్ట్స్ సర్వీసెస్, ఫైనాన్స్, అకౌంట్స్, సేఫ్టీ, ఐటీ, పీ అండ్ ఎస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ntpc.co.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







