మెగా-కింగ్ వార్: దసరా బరిలో తలపడనున్న ఇద్దరు స్టార్ హీరోలు
- July 18, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తామని మేకర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ సందర్భంగా ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశారు ‘గాడ్ ఫాదర్’ మేకర్లు.
అయితే, దసరా బరిలో దిగేందుకు ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఆయన నటిస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు నాగార్జున.
సెంటిమెంట్స్‌ని బాగా నమ్మే నాగార్జున, ‘ది ఘోస్ట్’ రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట. తన కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘శివ’ మూవీని ఈ డేట్‌లోనే రిలీజ్ చేశాడట.
ఆ సెంటిమెంట్‌ని, ‘ది ఘోస్ట్’ రిలీజ్ విషయంలో ఫాలో చేయాలనుకుంటున్నాడనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే, దసరా సీజన్ అంటే, సినిమాలకు కాసుల పంటే అని చెప్పాలి. ఆ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని స్టార్ హీరోలే కాదు, యంగ్ హీరోలు సైతం తొందరపడుతుంటారు.
అంతేకాదు, ఈ సీజన్‌కి ఎన్ని సినిమాలొచ్చినా తట్టుకోగల కెపాసిటీ వుండనే వుంది. ఒకవేళ ఇద్దరు స్టార్ హీరోలు రేస్‌లో దిగినా, ఇటు ప్రేక్షకులకు ఓ పక్క దసరా పండగ, మరోవైపు బాక్సాఫీస్‌కి కాసుల పండగ రెండూ వర్కవుట్ అయినట్లే. అలా జరుగుతుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..