‘పుష్ప..’ రెండు కాదు మూడు.! అయ్యో.! అల్లు అర్జున్ ఇరికేసినాడే.!
- July 19, 2022
అల్లు అర్జున్, రష్మికా మండన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. నిజానికి చాలా సాదా సీదాగా తెరకెక్కిన ఈ సినిమా, ప్యాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది.
ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని విలన్ ఫహాద్ పాజిల్‌తో పోలీస్ స్టేషన్ సీన్ తెరకెక్కించేటప్పుడే ఆలోచన చేశాడట డైరెక్టర్ సుకుమార్. అది కూడా ఫహాద్ ఫాజిల్ నేపథ్యంలోనేనట. అంటే, సెకండ్ పార్ట్ మొత్తం ఫహాద్ ఫాజిల్ వైపు నుండే వుండేలా ప్లాన్ చేశాడన్న మాట.
అందుకు తగ్గట్లుగానే మొదటి పార్ట్‌ని అక్కడే కట్ చేశాడు సుకుమార్. ఓకే, ‘పుష్ప 2’ కోసం ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, ‘పుష్ప’ రెండో పార్టే కాదు, మూడో పార్ట్ కూడా వుండబోతోందట.
ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ, మూడో పార్ట్ కోసం కూడా రెడీగా వుండమని ఫహాద్ ఫాజిల్‌కి సుకుమార్ సూచించాడట. తాజాగా ఆయన ఇదే విషయాన్ని బయటికి చెప్పేశారు. కావాలనే చెప్పారో, అనుకోకుండా చెప్పారో కానీ, ‘పుష్ప 3’ సీక్రెట్ రివీల్ అయిపోయింది.
అయితే, మరి బన్నీ పరిస్థితేంటీ.? ఇప్పటికే పుష్ప రెండో పార్ట్ సెట్స్ మీదికెళ్లడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇక మూడో పార్ట్ అంటే, అది కూడా పూర్తయ్యే వరకూ బన్నీ వేరే డైరెక్టర్‌కి కమిట్ అవ్వడానికి లేదు కదా. ఇలా అయితే, బన్నీ ఒకే డైరెక్టర్‌తో ఇంకెన్నాళ్లో.. ఇరుక్కుపోయాడుగా.!
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!