‘థాంక్యూ’పై చైతూ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు మరి.!

- July 19, 2022 , by Maagulf
‘థాంక్యూ’పై చైతూ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు మరి.!

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’ సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి ఎవ్వర్ గ్రీన్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. రాశీ ఖన్నా, చైతూతో జత కట్టింది ఈ సినిమా కోసం. ఈ నెల 22న ‘థాంక్యూ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ సినిమాని ఏదో ఆషా మాషీగా ఒప్పుకోలేదట చైతూ. తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులకు థాంక్యూ చెప్పుకునేందుకే ఈ సినిమాలో నటించాడట. అదే విషయాన్ని చెబుతూ, మొన్నా మధ్య తల్లి, తండ్రితో దిగిన ఫోటోలను చైతూ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, సమయానికి తగ్గట్టుగా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడమెలాగో తనకి నేర్పించిన సినిమాగా ‘థాంక్యూ’ సినిమాని అభివర్ణిస్తున్నాడు నాగ చైతన్య. 

ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయ్. ఖచ్చితంగా కంటెంట్ రిచ్ సినిమా అవుతుంది ‘థాంక్యూ’ సినిమా.. అంటూ ఈ సినిమా గురించి కాస్త ఎక్కువే చెబుతున్నాడు చైతూ. అంటే నిజంగానే ఈ సినిమాకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయినట్టున్నాడు చైతూ. 
చైతూ ఆశలన్నీ ఈ సినిమా పైనే అని అర్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’తో వచ్చిన సక్సెస్ నిలబడాలంటే, ‘థాంక్యూ’తో అది కంటిన్యూ అవ్వాలి. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడట చైతూ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com