ట్రక్కును ఢీకొట్టిన బస్సు...25 మంది మృతి
- July 19, 2022
కైరో: ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.మరో 35 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. మిన్యా ప్రావిన్స్‌లోని మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
అయితే, ఈజిప్ట్‌లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయపోకవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ ఏడాది జనవరిలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి.ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా. మరో 18 మంది గాయపడ్డారు.గతేడాది ఏప్రిల్ హైవేపై లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..