తెలంగాణ కరోనా అప్డేట్
- July 19, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 552 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 658 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 316 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41 కేసులు, ఖమ్మంలో 30 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 25 కేసులు, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 628 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,10,976 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 02వేల 354 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 511కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 25వేల 585 కరోనా టెస్టులు చేయగా.. 540 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







