వస్తువుల దిగుమతులపై నిబంధనలు పాటించాలి.. కస్టమ్స్ అథారిటీ

- July 20, 2022 , by Maagulf
వస్తువుల దిగుమతులపై నిబంధనలు పాటించాలి.. కస్టమ్స్ అథారిటీ

రియాద్: వ్యక్తిగత వస్తువులను తక్కువ పరిమాణంలోనే దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉందని, వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకునేందుకు అనుమతి లేదని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA)  వెల్లడించింది. ఒక వ్యక్తి దిగుమతి చేసుకోవడానికి అనుమతించబడిన పరిమాణాన్ని పోర్ట్‌లోని సంబంధిత కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ నిర్ణయిస్తారని అథారిటీ పేర్కొంది. https://zatca.gov.sa/en/RulesRegulations/Taxes/Pages/Integrated- Tarrifs.aspx లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించబడే కస్టమ్స్ రుసుము, విధానాలు, వివరాల గురించి సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కమర్షియల్ రిజిస్ట్రీ ఎంత మేరకు అవసరం అనే విషయంపై ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా ZATCA వివరణ ఇచ్చింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం దిగుమతి చేసుకున్న షిప్‌మెంట్ యజమాని కస్టమ్స్ ప్రక్రియను పూర్తి చేయడానికి తన గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ లేదా రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా)ను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. దిగుమతి చేసుకున్న షిప్‌మెంట్ యజమాని తప్పనిసరిగా ఇన్‌వాయిస్‌లు, పత్రాలను అరబిక్‌లోకి అనువదించాలని సూచించింది. కస్టమ్స్ డిక్లరేషన్‌తో డెలివరీ బిల్లు, ఒరిజినల్ ఇన్‌వాయిస్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజినల్ (CO) పత్రాలను జతచేయాల్సి ఉంటుందని అథారిటీ వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com