చట్టవిరుద్ధంగా విల్లా సబ్‌లెట్.. అద్దెదారుకు Dh300,000 జరిమానా

- July 20, 2022 , by Maagulf
చట్టవిరుద్ధంగా విల్లా సబ్‌లెట్.. అద్దెదారుకు Dh300,000 జరిమానా

అబుదాబి: ఒక విల్లాను చట్టవిరుద్ధంగా విభజించి నాలుగు కుటుంబాలకు సబ్‌లెట్ చేసిన అద్దెదారు నష్టపరిహారంగా ఇంటి యజమానికి Dh300,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తన విల్లాను అక్రమంగా సబ్ లెట్ చేసిన అద్దెదారుపై విల్లా యజమాని కోర్టులో దావా వేశారు. తన అనుమతి లేకుండా అద్దెదారుడు ఇతర కుటుంబాలకు సబ్‌లెట్ చేయడం వల్ల నష్టం జరిగిందని అతను పేర్కొన్నాడు. ఇది అబుదాబిలోని హౌసింగ్ చట్టాలను ఉల్లంఘించడమేనని కూడా ఫిర్యాదుదారు వాదించారు. అద్దెదారు తన విల్లాకు పునరుద్ధరణ, నిర్వహణకు పరిహారంగా Dh510,000 చెల్లించాలని యజమాని డిమాండ్ చేశాడు. అలాగే అద్దెదారు తనఇంటిని ఖాళీ చేయించాలని అతను కోర్టును అభ్యర్థించాడు. ఇరువురి వాదలు విన్న అబుదాబి ఫ్యామిలీ కోర్ట్.. సివిల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్‌ల కోసం ప్రతివాది హౌసింగ్ నిబంధనలను ఉల్లంఘించాడని, మార్పులు చేయడం వల్ల విల్లాకు నష్టం వాటిల్లిందని తీర్పు చెప్పింది. నష్టపరిహారంగా ఫిర్యాదుదారుడికి Dh300,000 చెల్లించాలని న్యాయమూర్తి అద్దెదారున్ని ఆదేశించారు. అలాగే ఇంటియజమానికి న్యాయపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com