కోల్ ఇండియాలో ఉద్యోగాలు...
- July 20, 2022
కోల్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1050 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ ఈడీపీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మైనింగి విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ,బీటెక్,బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. సివిల్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సిస్టం అండ్ ఈడీపీ కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. సంబంధిత విభాగాల్లో గేట్ 2022 స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.coalindia.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







