గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం
- July 20, 2022
సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం అందోళన కలిగిస్తోంది. గల్ఫ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 50°Cకి చేరుకుంటాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మంగళవారం నాడు దమ్మామ్ నగరంలో 48 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని.. ఇది రాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొంది. ఆ తర్వాత అల్-ఖర్జ్ నగరంలో 46°C, రాజధాని నగరం రియాద్‌లో 45 °C నమోదైందని ప్రకటించింది. మరోవైపు కువైట్‌లో ఈ వారంలో (బుధవారం నుండి శనివారం) ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ నుండి 50 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం, చురుకైన గాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







