దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- July 21, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో రెహోబోత్ డానియల్ అనే భారత దేశానికి చెందిన వ్యక్తి ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో డానియల్ విజేతగా నిలిచాడు.ఇటీవల అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ నం.1002కు ఈ జాక్పాట్ తగిలింది.దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి 1 మిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి.దుబాయ్లో ఓ బుక్ షాప్ యజమాని అయిన 63 ఏళ్ల డానియల్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు.ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.“ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు.మీ ప్రమోషన్ చాలా మందికి సహాయం చేస్తోంది.ఇది చాలా కాలం పాటు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







