మొన్న రామ్, ఇప్పుడు నిత్యామీనన్.!
- July 21, 2022
సెలబ్రిటీల పెళ్లి వార్తలంటే ఒకింత ఆసక్తి వుండడం సహజమే. కానీ ఈ మధ్య సోషల్ మీడియా ట్రెండ్ పెరిగాక, పుట్టిందంటే చాలు.. అదిగో పెరిగిపోయింది.. అనేయడం ట్రెండింగ్‌గా మారిపోయింది.
ఆసుప్రతిలో చేరితే, హార్ట్ ఎటాక్, ప్రేమలో పడితే పెళ్లి అయిపోయినట్లే.. ఇలాంటి ఫేక్ వార్తలతో ఊదరగొడుతున్నారు. కొందరు సెలబ్రిటీలయితే, ఈ ఫేక్ న్యూస్ చూసి, ఎంజాయ్ చేసి ఊరుకుంటారు. ఇంకొందరైతే రెస్సాండ్ అయ్యి స్ర్టాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.
మొన్న రామ్‌కి అలాగే సోషల్ మీడియాలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారు. పెళ్లి కూతురు కూడా సోషల్ కోళ్లే డిసైడ్ చేసేశాయ్. తర్వాత రామ్ తూచ్ అనడంతో ఆ ఫేక్ వార్తలకు చెక్ పడింది.
ఇప్పుడేమో నిత్యా మీనన్.. ఈ ముద్దుగుమ్మకీ పెళ్లి ఫిక్స్ చేసేశారు. తూచ్.! అదంతా వుత్తదే.. అంటూ నిత్యామీనన్ కూడా తాజాగా ఆ వార్తల్ని ఖండించింది. అంతేకాదు, పెళ్లి, గిళ్లీలాంటి గుడ్ న్యూస్ ఏమైనా వుంటే, ముందుగా మీకు చెప్పే చేసుకుంటాలెండి.. కానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.! అని ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేసింది నిత్యా మీనన్.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









