కువైట్ లో వారంతంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు!

- July 22, 2022 , by Maagulf
కువైట్ లో వారంతంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు!

కువైట్: ఈ వీకెండ్ వారాంతపు వాతావరణం వేడిగా ఉంటుంది, దుమ్ము ధూళి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖకు చెందిన అబ్దుల్ అజీజ్ అల్-ఖరావీ తెలిపారు. వారాంతంలో దేశంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, తీర ప్రాంతాల్లో సాపేక్షంగా తేమగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు 47-49 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము ధూళి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com