'గోల్డెన్ అవర్–ది గేమ్ ఛేంజర్' మెడిసిన్ సదస్సును నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్
- July 25, 2022
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (SEMI) మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు ఈ రోజు ఎమర్జెన్సీ మెడిసిన్ కాన్ఫరెన్స్ - “గోల్డెన్ అవర్–ది గేమ్ ఛేంజర్” ను 24 జూలై 2022న హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్ నందు నిర్వహించింది.ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వైద్య నిపుణులు 300 మందికి పైగా పాల్గొన్నారు.
ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కు తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, బ్రెయిన్ స్ట్రోక్, పాలీట్రామా, సెప్సిస్ తో వచ్చే పేషెంట్స్ కు మొదతి గంటలో (గోల్డెన్ అవర్ ) ఎటువంటి అత్యుత్తమ చికిత్సను అందించాలి తీసుకోవాలి అని నిపుణులకు అవగాహన కల్పించడం మరియు శిక్షణ ఇవ్వడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.ఈ యొక్క గోల్డెన్ అవర్ అను ప్రోగ్రాంలో చికిత్స విధానాల యొక్క సరికొత్త మార్గదర్శకాలు మరియు అధునాతన పద్ధతులను అందరికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమం కోసం వక్తలు విస్తృత శ్రేణితో విభిన్న ప్రత్యేకతలలో వివిధ వైద్య నిపుణులు వారి యొక్క అభిప్రాయాలను అక్కడ పాల్గొన్న అందరికి తెలియపరిచారు.
మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ “సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్లిష్ట సమయాల్లో ప్రతి నిమిషం ముఖ్యమైనది మరియు జీవితాలను రక్షించడానికి గోల్డెన్ అవర్ చాలా కీలకం.
ఆర్గనైజింగ్ ఛైర్మన్ & గ్రూప్ డైరెక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం గారు మాట్లాడుతూ "ఏదైనా అత్యవసర పరిస్థితిలో - మొదటి 60 నిమిషాల్లో అందించే సంరక్షణ, రోగి యొక్క ఫలితాన్ని పూర్తిగా మారుస్తుంది" అని పునరుద్ఘాటించారు. పాలీట్రామా, అక్యూట్ MI, స్ట్రోక్ మరియు సెప్సిస్ విషయంలో గోల్డెన్ అవర్‌ను వర్తింపజేయడం యొక్క ప్రాముఖ్యతను మరియు ERలోని అటువంటి రోగులకు సంబంధించిన అధునాతన చికిత్సా విధానాలను చర్చించారు.
డాక్టర్ శరత్ రెడ్డి క్లినికల్ డైరెక్టర్ & ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ 'ఎమర్జెన్సీ విభాగానికి హాజరయ్యే రోగుల యొక్క ఉత్తమ ఫలితం కోసం గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ యొక్క పురోగతిని తెలుసుకోవడం అందరికి ఎంతో ప్రాముఖ్యం.దీని ద్వారా నాణ్యమైన సంరక్షణ వల్ల రోగుల ప్రాణాలను రక్షించడంలో ఎమర్జెన్సీ నిపుణుల పాత్ర కీలకమైనది.
డాక్టర్ రాకేష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ గోల్డెన్ అవర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చెబుతూ, “చాలా మంది ప్రజలు గోల్డెన్ అవర్ సమయంలో రోగిని తరలించడాన్ని ఆలస్యం చేస్తారు, ఇది చాలా ఖరీదైనదిగా రుజువు చేస్తుంది. సమయానుకూల చర్య ఎల్లప్పుడూ ప్రాణాలను కాపాడుతుంది. ”
గౌరవ అతిథులుగా డాక్టర్ సంపత్ కుమార్ (ఐఎంఏ ప్రెసిడెంట్ - తెలంగాణ), డాక్టర్ చంద్ర మోహన్ (ఐఎంఏ సెక్రటరీ - కూకట్పల్లి), డాక్టర్ వెంకటేష్ ఎఎన్ (ప్రెసిడెంట్ - సెమీ) పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







