భారత్ కరోనా అప్డేట్
- July 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు.మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరింది. ఇప్పటి వరకు 4,32,46,829 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ కారణంగా 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.34శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.47శాతంగా ఉందని పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.84శాతం ఉందని, విక్లీ పాజిటివిటీ రేటు 4.53శాతం ఉందని చెప్పింది. గత 24గంటల్లో 4,26,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 87.37 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. టీకా డ్రైవ్‌లో 202.5కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







