యూఏఈ నివాసితులకు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
- July 27, 2022
యూఏఈ: యూఏఈ నివాసితులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యూఏఈ పాస్‌పోర్ట్ కలిగిన రెసిడెంట్స్‌కు డజను దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ, వీసా-ఆన్-అరైవల్ సదుపాయాలను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని అత్యంత ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. ఇక ఈ 12 దేశాల్లో ఏడు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ కి అనుమతిస్తే.. మరో ఐదు దేశాలు వీసా ఆన్అరైవల్ ఫెసిలిటీ కల్పించాయి. యూఏఈకి చెందిన ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ http://Musafir.com చెప్పిన వివరాల ప్రకారం.. జార్జియా, మాల్దీవులు, సీషెల్స్, మారిషస్, కజకిస్థాన్,సెర్బియా, జోర్డాన్ దేశాల్లో యూఏఈ నివాసితులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నట్లు వెల్లడించింది.
అలాగే అర్మేనియా, అజర్బైజాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్థాన్, థాయిలాండ్, అల్బేనియాలో వీసా ఆన్అరైవల్ సౌకర్యాన్ని కల్పించాయని తెలిపింది.ఇక గత వారం విడుదలైన హెన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో యూఏఈ పాస్‌పోర్ట్ 15వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.ఈ పాస్పోర్టుతో వీసా లేకుండా ఏకంగా 176 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్(GCC)లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ యూఏఈదే.యూఏఈ బలమైన పాస్‌పోర్ట్, అధిక తలసరి ఆదాయం దేశంలోని ప్రవాసులకు ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుండి వీసాలు పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..