దుబాయ్ లో నిజాయితీ చాటిన ట్యాక్సీ డ్రైవర్లు..
- July 29, 2022
దుబాయ్: తన కారులో ప్రయాణికుడు మరిచిపోయి వెళ్లిన 1మిలియన్ దిర్హాములతో కూడిన బ్యాగ్‌ను ట్యాక్సీ డ్రైవర్ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఘటన దుబాయ్ లో జరిగింది.దాంతో ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకుని దుబాయ్ ఆర్‌టీఏ, పోలీస్ విభాగం ఘనంగా సన్మానించాయి.రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల చైర్మన్ మత్తర్ మహమ్మద్ అల్ తాయర్ ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు తమ విధులను నియబద్ధతతో నిర్వర్తించిన తమ సిబ్బందిని ప్రత్యేక ప్రశంస పత్రాలను అందజేసి వారి సేవలకు ధన్యవాదాలు తెలిపారు.దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ (DTC)కి చెందిన నాన్సీ ఓర్గో తన ట్యాక్సీలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఒక బ్యాగును 1 మిలియన్ దిర్హామ్‌లతో కూడిన బ్యాగ్‌ను వదిలి వెళ్లిన ఒక ప్రయాణికుడికి అందజేసింది.
మరో డ్రైవర్ తన ట్యాక్సీలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఒక బ్యాగును మరిచిపోయి వెళ్లడం డ్రైవర్ ఉమర్ అల్తాఫ్ హుస్సేన్ గుర్తించాడు. ఆ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే భారీ మొత్తంలో నగదు కనిపించింది. దాంతో వెంటనే అక్కడే వీధులు నిర్వహిస్తున్న పార్కింగ్ ఇన్‌స్పెక్టర్ ఒబేద్ మిఫ్తా అబ్దుల్లాకు ఆ బ్యాగును అప్పగించాడు. దాంతో ఒబేద్ ఆ బ్యాగును పోలీస్ విభాగానికి అందజేశారు.ఇలా భారీ నగదు ఉన్న బ్యాగును రిటర్న్ చేసిన డ్రైవర్ అల్తాఫ్ నిజాయితీని మెచ్చుకున్న అధికారులు అతనికి గురువారం ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రశంస పత్రంతో పాటు కొంత నగదును బహుమానం అందజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..