రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్
- July 29, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా రక్త దాన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యదృచ్ఛికంగా అదే రోజున కువైట్ పై ఇరాక్ అక్రమ చేసి 32 సంవత్సరాలు అవుతుంది.
రక్త సంబంధిత సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్ రద్వాన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు ఉంటాయి అని ప్రకటించారు. అంతేకాకుండా దాతలను జబ్రీయా లోని కువైట్ కేంద్ర బ్లడ్ బ్యాంక్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమం ద్వారా 359 ప్యాకెట్ల రక్తం సమకూరింది. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పాల్గొని రక్తం దానం చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







