యూఏఈ వరదల్లో ఏడుగురు ప్రవాసులు మృతి

- July 30, 2022 , by Maagulf
యూఏఈ వరదల్లో ఏడుగురు ప్రవాసులు మృతి

యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో ఏడుగురు  మరణించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన ఏడుగురు ఆసియా జాతీయులని, MOI ఫెడరల్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ అలీ సలేమ్ అల్-తునిజీ తెలిపారు. షార్జా, ఫుజైరా, రస్ అల్-ఖైమా నగరాలు వరలకు ఎక్కువగా ప్రభావితం అయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, మంపు ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. వరదలకు గురైన వారిలో 80 శాతం మంది గత రెండు రోజుల్లో తమ నివాసాలకు తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. ఫుజైరా, ఖోర్ ఫక్కన్‌లను కలిపే ప్రధాన రహదారి తెరిచే పనులు పూర్తి కావస్తున్నాయని అల్-తునిజీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com