యూఏఈ వరదల్లో ఏడుగురు ప్రవాసులు మృతి
- July 30, 2022
యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో ఏడుగురు మరణించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన ఏడుగురు ఆసియా జాతీయులని, MOI ఫెడరల్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ అలీ సలేమ్ అల్-తునిజీ తెలిపారు. షార్జా, ఫుజైరా, రస్ అల్-ఖైమా నగరాలు వరలకు ఎక్కువగా ప్రభావితం అయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, మంపు ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. వరదలకు గురైన వారిలో 80 శాతం మంది గత రెండు రోజుల్లో తమ నివాసాలకు తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. ఫుజైరా, ఖోర్ ఫక్కన్లను కలిపే ప్రధాన రహదారి తెరిచే పనులు పూర్తి కావస్తున్నాయని అల్-తునిజీ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







