జర్నలిస్టు జమీర్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం
- July 30, 2022
హైదరాబాద్: ఇటీవలే న్యూస్ కవరేజీకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి ప్రాణం కోల్పోయిన జగిత్యాల ఎన్టీవీ ప్రతినిధి జమీర్ కుటుంబానికి గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ మానవతా దృక్ఫతంతో తనవంతు సహాయాన్ని అందించింది. జమీర్ అకాల మరణంతో అతని కుటుంబం రోడ్డున పడిందనే సమాచారాన్ని అందుకున్న గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, సౌదీ అరేబియా టీడీపీ ఎన్నారై సెల్ బాధ్యులు ఖాలిక్ సైఫుల్లాలు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) కేంద్ర కార్యాలయంలో జమీర్ తల్లి బషీర్ బీ, పిల్లలు సఫీయాన్, సారా సద్దాఫ్ లకు అందించారు. మానవతా దృక్పథంతో జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన టీడీపీ గల్ఫ్ ఎన్నారై సెల్ బాధ్యులను టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు అభినందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!