డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగం.. 105,300 మందికి జరిమానా

- July 31, 2022 , by Maagulf
డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగం.. 105,300 మందికి జరిమానా

యూఏఈ: 2022 మొదటి ఆరు నెలల్లో అబుదాబి రోడ్లపై మొబైల్ ఫోన్‌లను ఉపయోగించినందుకు మొత్తం 105,300 మంది వాహనదారులకు జరిమానా విధించారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్లు ఫోన్‌లలో మాట్లాడటం లేదా మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీయడం వంటివి చేస్తూ పట్టుబడ్డారని అబుదాబి పోలీస్‌లోని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ మేజర్ మహ్మద్ దహీ అల్ హుమిరి తెలిపారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే నాలుగు బ్లాక్ పాయింట్లతో పాటు 800 దిర్హామ్‌లు జరిమానా పడుతుందన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం చాలా మంది వాహనదారులకు ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారిందని, ఇది రహదారి భద్రతకు చాలా పెద్ద ప్రమాదకరం అని అల్ హుమిరి అన్నారు. డ్రైవర్లు మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం, సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను బ్రౌజ్ చేయడం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఏకాగ్రత కోల్పోవడం, నిర్లక్ష్యం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లను పట్టుకునేందుకు అబుదాబి రోడ్లపై స్మార్ట్ పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేసినట్లు అబుదాబి పోలీసులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com