వివిధ కేసుల్లో 78 మందిని అరెస్టు చేసిన నజహా

- July 31, 2022 , by Maagulf
వివిధ కేసుల్లో 78 మందిని అరెస్టు చేసిన నజహా

రియాద్: లంచం, మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీ కేసుల్లో ఇప్పటి వరకు 78 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ(Nazaha) ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి ఆరోపణల కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో నజహా విభాగం క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. 

ఇప్పటికే రక్షణ , ఆరోగ్య , న్యాయ , విద్యా, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు& హౌసింగ్ మంత్రిత్వ శాఖ ల పరిధిలో ఉన్న అవినీతి ఆరోపణల కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నజహా అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు నాజా అధికారులు తెలిపారు. 

ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేయగా మరో 116 మంది పై వివిధ కేసుల్లో విచారణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అరెస్ట్ చేసిన 78 మంది నిందితుల్లో పలు కారణాలతో బెయిల్ మీద విడుదల అయ్యారు. 

దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని నజహా ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 980 , ఈమెయిల్ ఐడి: [email protected] లను ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com