భారత్ కరోనా అప్డేట్

- August 01, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,464 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 16,112 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది. భారత్​లో ఆదివారం 8,34,167 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది. మరో 2,73,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,79,258 మంది వైరస్​ బారినపడగా.. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,20,96,907కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,19,731 మంది మరణించారు. ఒక్కరోజే 6,55,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,21,65,705కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com